Life of Ram: మెలోడీకి జీవం పోసిన 'లైఫ్ ఆఫ్ రామ్' 11 d ago

‘'లైఫ్ ఆఫ్ రామ్’ పాట, జాను చిత్రంలో అత్యద్భుతంగా నిలిచింది. కథానాయకుడి ఒంటరి ప్రయాణాన్ని వివరిస్తూ చెప్పే ఈ పాటకు, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పదాలు మనసును తాకుతాయి. 2020 ఫిబ్రవరిలో యూట్యూబ్ లో పోస్టు చేసిన ఈ పాటకు ఇప్పటి దాక 22కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. శర్వానంద్ నటన, గోవింద్ వసంత సంగీతం కలసి ఈ పాటను అద్భుతంగా మార్చాయి. పాట విడుదలైన 5 ఏళ్ల తర్వాత కూడా దాని క్రేజ్ తగ్గకపోవడం అభిమానుల హృదయాలలో ఎలాంటి స్థానం సంపాదించిందో తెలుస్తుంది. ఇది స్ఫూర్తిదాయకంగా, లోతుగా సాగిన మెలోడీ సాంగ్ .